జైలర్ 2 కి బ్లాక్ బస్టర్ టాక్
Jailer 2 Social Media Talk
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 తో కొట్టేసారు, బ్లాక్ బస్టర్ కొట్టేసారు.. ఇదే ఆయన అభిమానుల నుంచి వస్తున్న మాట. సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతున్న టాక్. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 సూపర్ హిట్ అంటూ వేస్తున్న ట్వీట్లు చూస్తే సినిమా ఎలా ఉందొ అర్ధమవుతుంది.
రజినీకాంత్ స్టయిల్, దర్శకుడు రజినీ కేరెక్టర్ కి ఇచ్చిన ఎలివేషన్ అభిమానులే కాదు మూవీ లవర్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. రజనీకాంత్ కి జైలర్, జైలర్ 2 తో దర్శకుడు నెల్సన్ బ్లాక్ బస్టర్ ని అందించాడు, అనిరుద్ BGM సూపర్ స్టార్ ని మరోసారి నెక్స్ట్ లెవల్లో కూర్చోబెట్టింది.
తెలుగు ప్రేక్షకులు అన్నట్టుగా అనిరుద్ రవిచంద్ర కోలీవుడ్ హీరోలకు అందులోను రజినీకాంత్ కి ఇచ్చే ఎలివేషన్ నేపధ్య సంగీతం, మ్యూజిక్ మరో హీరోకి ముఖ్యంగా తెలుగు హీరోలకు ఇవ్వడు అన్నట్టుగా జైలర్ 2కి అనిరుద్ మ్యూజిక్ , BGM ఆ లెవల్లో ఇచ్చాడు. జైలర్ 2 ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవల్, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది కానీ చిన్న డ్రా బ్యాక్ ఉంది అంతే తప్ప జైలర్ 2 ఓవరాల్ గా అదుర్స్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
ఇక జైలర్ 2 పై సోషల్ మీడియాలో బ్లాక్ బస్టర్ ట్వీట్లు పడుతున్నాయి. అంటే జైలర్ దసరా హాలిడేస్ లో పర్ఫెక్ట్ విన్నర్ గా నిలిచినట్టే.















































