దాదా: అందుకే ఈ కాన్ఫిడెన్స్

Dada Shooting updateDada Shooting update

 

నందమూరి బాలకృష్ణ కి దాదా షూటింగ్ సెట్ లో ప్రమాదం జరిగి మోకాలి సర్జరీ అవడంతో దాదా చిత్రం ఈ ఏడాది షూటింగ్ అవ్వదు, ఈ ఏడాది విడుదల కూడా కుదరదని అనుకున్నారు. బాలయ్య రెస్ట్ లో ఉండగానే దర్శకుడు గోపీచంద్ మలినేని దాదా టైటిల్ తో పాటుగా డిసెంబర్ 24 రిలీజ్ అంటూ అనౌన్స్ చేసేసారు.

అయినప్పటికీ డిసెంబర్లో దాదా వస్తుందా అనే సందేహాలు కలిగాయి. బాలయ్య సెట్ లోకి ఎంటర్ అయ్యారు, షూటింగ్ ఊపందుకుంది, అంతేకాదు రీసెంట్ గా మొదలైన మైసూర్ షెడ్యూల్ కూడా ఆల్మోస్ట్ పూర్తి కావోతుంది. ఇక హైదరాబాద్ లో మరో అయిదారు రోజులు షూట్ చేస్తే, టోటల్ టాకీ వర్క్ పూర్తయిపోతుంది.

మరి ఈ మాత్రం క్లారిటీ, కాన్ఫిడెన్స్ ఉండబట్టే గోపీచంద్ మలినేని దాదా ని డిసెంబర్ 24 కి ఫిక్స్ చేసారు. షూటింగ్ ఫినిష్ అయ్యే డేట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు నవంబర్ సరిరిపోతుంది, అలాగే డిసెంబర్లో ప్రమోషన్స్ చేసేసి సినిమాని కూల్ గా ఆడియన్స్ ముందుకు తెచ్చేస్తారు. ఇది ప్లానింగ్ అంటే అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు.

Dada Movie