ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Who is in the danger zone this week?

బిగ్ బాస్ 10: ఈ వారం డేంజర్ జోన్ ఎవరంటే..

Bigg Boss 10: Who is in the danger zone this week?Bigg Boss 10: Who is in the danger zone this week?

 

గత వారం బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ నుంచి కామనర్స్ గా అగ్నిపరీక్ష తో ఎంటర్ అయిన అపూర్వ, చరణ్ లు బ్యాక్ టు బ్యాక్ ఎలిమినేట్ అయ్యారు. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన వారంతా గట్టిగా అరుస్తూ మట్లాడుతూ షో చేస్తున్నారు తప్ప టాస్క్ ల్లో ఆడడం లేదు అనే కంప్లైంట్ చాలామందిలో ఉంది. కానీ వారు ఒప్పుకోరు.

ఇక షాలిని ని కూడా గత వారం ఆడియన్స్ పంపించాలనుకున్నారు. రోహిత్ చాటు ఉండి గేమ్ ఆడుతున్న షాలిని పై విపరీతమైన నెగివిటి హౌస్ మేట్స్ లోనే కాదు, బయట ఆడియన్స్ లోను ఉంది. ఇక ఈ వారం మొత్తంగా ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. ఐదోవారం తర్వాత హౌస్ లోకి వచ్చిన వైల్డ్ ఫైర్స్ ద్వారా ఈ నామినేషన్స్ జరిగాయి.

ఈ వారం షాలిని పై ఎక్కువ సభ్యులు నామినేషన్స్ వేశారు. షాలిని, వర్షిణి, వంశీ, రాం ప్రసాద్, అమన్, రోహిత్ ఈ వారం నామినేట్ అయిన వారిలో ఉన్నారు. బయట ఎంతగా నెగిటివిటి ఉన్నా రోహిత్ నామినేషన్స్ లో ఉంటె ఓటింగ్ లో టాప్ ప్లేస్ లోకి వస్తున్నాడు. ఈ వారము అదే జరిగింది. రోహిత్ నెంబర్1 పొజిషలో ఉంటే రాంప్రసాద్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.

అమన్ మూడో స్థానంలో ఉంటె.. టెంపర్ వంశీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ వారం వర్షిణి, షాలిని డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతున్నట్లుగా ఆన్ లైన్ ఓటింగ్ రిజల్ట్స్ చెబుతున్నాయి. 

Bigg Boss Telugu 10