ప్రథమ దృష్ట్య కుట్టక్కర్: ఇంట్రెస్టింగ్ క్రైమ్ మిస్టరీ
Pradhama Drishtiya Kuttakkar : An Interesting Crime Mystery
మలయాళంలో చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి థియేటర్లులో బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్న చిత్రాలు ఓటీటీ లోను అంతే హిట్ అవుతున్నాయి. మలయాళం నుంచి తెలుగులో డబ్ అవకపోయినా ఆ చిత్రాలకు ఓటీటీ లో విపరీతమైన క్రేజ్. ఇప్పుడు ఆ కోవలో నెట్ ఫ్లిక్స్ నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చింది ప్రథమ దృష్ట్య కుట్టక్కర్. ప్రథమ దృష్ట్య కుట్టక్కర్ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది అన్నప్పటికి.. కేవలం మలయాళ లాంగ్వేజ్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ నుంచి అందుబాటులోకి వచ్చింది.
ప్రథమ దృష్ట్య కుట్టక్కర్ కథలోకి వెళితే.. కారుణ్య నియామకం కింద పోలీస్ ఉద్యోగం పొందిన అమ్మాయి అలీనా అబ్రహాం(పార్వతి తిరువోతు) ఈ చిత్ర కథలో కీలకంగా ఉంటుంది. నైట్ పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులకు ఓ ప్రొఫెషనల్ దొంగ దొరుకుతాడు, పోలీసులు నుంచి తప్పించుకుంటున్న అతన్ని ఛేజ్ చేసి అలీనా అబ్రహాం బృందం పట్టుకుని స్టేషన్ కి తీసుకొస్తుంది. అతని కార్ డిక్కీ తెరుద్దామని అతని నుంచి కీస్ తీసుకుంటున్న సమయంలో ఆ దొంగ పోలిసుల పై తిరగబడతాడు. ఆ గొడవలో అలీనా అబ్రహాం చేతిలో తుపాకీ పేలి ఆ దొంగ చనిపోతాడు. ఆ కేసు నుంచి బయటపడేందుకు అలీనా అబ్రహాం బృందం ఎలాంటి ప్లాన్ చేసింది. క్రైమ్ బ్రాంచ్ నుంచి ఈ కేసు విషయంలో అలీనా అబ్రహాం బృందం ఎలా ఎస్కెప్ అయ్యింది అనేది ప్రథమ దృష్ట్య కుట్టక్కర్ స్టోరీ.
దర్శకుడు షాహాద్ కథను నడిపించిన తీరు, క్రైం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కథలోని ట్విస్ట్ లు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. పార్వతి తిరువోతు అలీనా అబ్రహాం కేరెక్టర్ లో అద్భుతంగా పెర్ఫర్మ్ చేసింది. ముజీబ్ మజీద్ నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ అన్ని ఈ చిత్రానికి హైలైట్స్. అక్టోబర్ 9 నుంచి కేవలం మలయాళంలో స్ట్రీమింగ్ కి వచ్చిన ప్రథమ దృష్ట్య కుట్టక్కర్ ని సరదాగా ఓసారి వీక్షించెయ్యొచ్చు.
















































