పెయిడ్ బ్యాచ్ కి బిగ్ షాక్
Social Media effect
సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచ్ ని సినిమా లవర్స్ మాములుగా ఏసుకోవడం లేదు. డబ్బులు తీసుకుని ట్వీట్లు వేసి నాని ప్యారడైజ్ పై హైప్ క్రియేట్ చేసి ఆడియన్స్ ని పక్కదోవ పట్టించారంటూ పెయిడ్ బ్యాచ్ పై ఆడియన్స్ విరుచుకుపడుతున్నారు.. ప్యారడైజ్ మూవీ సెన్సార్ రిపోర్ట్, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల 40 రోజులుగా ఇంటికెళ్ళలేదు, నిద్రాహారాలు మానేసి ప్యారడైజ్ ని ఆడియన్స్ ముందుకు తెచ్చే పనిలో ఉన్నారు, హీరో నాని ఎడిటింగ్ రూమ్ లో కష్టపడుతున్నాడంటూ భజన చేసారు.
అంతేకాదు సెన్సార్ రిపోర్ట్ అంటూ సినిమా ఫస్ట్ హాఫ్, మదర్ సెంటిమెంట్, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతోంది అంటూ హైప్ ఎక్కించారు. కానీ సినిమా చూస్తేస్తే అదొక రాడ్డు మూవీ, మా టైమ్ వేస్ట్, డబ్బులు వేస్ట్ అంటూ పనిగట్టుకుని ట్వీట్లు వేసి సినిమాపై క్రేజ్ పెంచిన సో కాల్డ్ జర్నలిస్ట్ లపై రెచ్చిపోయి ఆడియన్స్ ట్రోలింగ్ కి దిగారు.
నిజాయితీగా ఉండండి, నిజాయితీగా ప్రమోట్ చెయ్యండి, డబ్బులు తీసుకుని పెయిడ్ ట్వీట్లు వేస్తూ ఆడియన్స్ ని పక్కదారి పట్టించకండి అంటూ మూవీ లవర్స్ సోషల్ మీడియా బ్యాచ్ పై విరుచుకుపడుతున్నారు.
















































