ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rashmika Says Her Crush On Vijay Deverakonda

విజయ్ పై క్రష్ తగ్గట్లేదు: రష్మిక

Rashmika Says Her Crush On Vijay DeverakondaRashmika Says Her Crush On Vijay Deverakonda

 

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ-హీరోయిన్ రష్మిక మందన్న ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా ఈ ఏడాదే పెళ్లి చేసుకుని ఓ ఇంటివారయ్యారు. పెళ్లి తర్వాత రష్మిక సినిమా షూటింగ్స్ అంటూ బిజీ అయ్యారు, అటు విజయ్ దేవరకొండ తన షూటింగ్స్ తో బిజీ అయ్యారు. పెళ్లి తర్వాత తాము ఎక్కవ సమయం గడపలేకపోయామంటూ రష్మిక ఈ మధ్యనే ఇంజ్యూరీ సమయంలో పోస్ట్ పెట్టింది.

ఇంజ్యూరీ కావడంతో ఇంట్లోనే భర్త విజయ్ దేవరకొండ తో కలిసి గడుపుతున్నందుకు ఎంతో సంతోషపడిపోతున్నట్లుగా చెప్పింది. ఇక విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్ళికి ముందు రెండు సినిమాలు చేసారు. పెళ్లి తర్వాత రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణబాలి చిత్రంలో కలిసి నటిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ సింగిల్ ఏందయ్యా సామి సాంగ్ లో విజయ్-రష్మిక కెమిస్ట్రీ అద్భుతంగా పండింది.

తాజాగా ఏందయ్యా సామి పాట వీడియో క్లిప్‌ను రష్మిక ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. భర్త విజయ్ దేవరకొండ ని ఉద్దేశించి..
అతడు పూర్తిగా నాకే సొంతమయ్యాడు. కానీ ఆయనపై క్రష్‌ మాత్రం తగ్గడం లేదు. ఇది కేజ్రీ అంటూ రాసుకొచ్చింది. దానికి హీరో విజయ్‌ రిప్లై ఇస్తూ.. నేను అదృష్టవంతుడిని. జయమ్మను మిస్‌ అవుతాను కానీ, నువ్వు మాత్రం జీవితాంతం నాతో ఉంటావు అంటూ సరదాగా భార్య రష్మిక ను ఆటపట్టించాడు.

Rashmika Mandanna Says Her Crush On Vijay Deverakonda Hasn t Faded After Marriage