ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> BB10: Audience shocks Mukesh and Shalini.

BB10: ముఖేష్, షాలిని కి ఆడియన్స్ షాక్

BB10: Audience shocks Mukesh and Shalini.BB10: Audience shocks Mukesh and Shalini.


బిగ్ బాస్ హౌస్ లో టెంప్టేషన్ vs టెన్షన్ అంటూ ఈ వారం హౌస్ మేట్స్ తో కొత్త ఆటఆడిస్తున్నారు. అందులో కొంతమంది కంటెస్టెంట్స్ ఈ టెంప్టేషన్ లో కెప్టెన్సీ కంటెండర్లు గా నిలిస్తే, మరికొంతమంది టెన్షన్ లో భాగంగా కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కోసం ఫుల్ గా ఫుడ్ పంపించి టెంప్ట్ చేసాడు బిగ్ బాస్. అందులో చాలామంది హౌస్ మేట్స్ ఆ యమ్మీ ఫుడ్ లాగించేసారు.

ఆ తర్వాత బిగ్ బాస్ వాళ్లకు టెన్షన్ పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసినట్టుగా ప్రోమో వదిలారు. అందులో ముఖేష్ గౌడ్ ఆట పై ఫోకస్ పెట్టడం లేదు, వర్షిణి తో ఉన్న బాండింగ్ తో అతని ఆటకు ఎఫెక్ట్ అవుతుంది అని బిగ్ బాస్ పై ఆడియన్స్ సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్ చూపించారు. దాంతో వర్షిణి హార్ట్ అయ్యి.. ముఖేష్ తో మాట్లాడుకుంటూ కూర్చుంది.

రామ్ ప్రసాద్ కన్నింగ్ అంటూ ఆడియన్స్ చెప్పిన అభిప్రాయాలను చూపించాడు. ఇక షాలిని వాగుతూనే ఉంటుంది, ఎప్పుడు లేట్ గా వస్తుంది, మాటలు జారుతుంది, ఇప్పటివరకు ఒక్క గేమ్ కూడా గెలవలేదు, బ్యాక్ బిచ్చింగ్ స్టార్, తన ఫ్రెండ్ ని అందరిముందు సపోర్ట్ చేస్తూ రోహిత్ దగ్గర మాత్రం మరోలా మాట్లాడుతుంది, ట్రిగ్గరింగ్ క్వీన్ అంటూ షాలిని బయట ఆడియన్స్ ఎలా మాట్లాడుకుంటున్నారో వేసి చూపించారు.

దానితో షాలిని రోహిత్ తో మీటింగ్ పెట్టింది. ముఖేష్-వర్షిణి, షాలిని-రోహిత్ లను త్రిగున్ ఎద్దేవా చేస్తూ వంశి తో చెబుతున్న ప్రోమో తెగ వైరల్ అవుతుంది. 

Bigg Boss 10: New promo out