ప్యారడైజ్ ఓటీటీ పార్ట్నర్ లాక్డ్

The Paradise OTT Partner LockedThe Paradise OTT Partner Locked

 

హీరో నాని-శ్రీకాంత్ ఓదెల కలయికలో సెకండ్ మూవీగా తెరకెక్కిన ది ప్యారడైజ్ మూవీ ఈరోజు సెప్టెంబర్ 24 న వర్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైన ప్యారడైజ్ ని కాస్త లేట్ గా హిందీలో రిలీజ్ చేస్తున్నారు. భారీ అంచనాలతో నిన్న నైట్ నుంచే ప్యారడైజ్ సందడి మిగతా భాషల థియేటర్స్ లో మొదలైపోయింది.

భారీ బడ్జెట్ తో శ్రీకాంత్ ఓదెల తెరక్కించిన ప్యారడైజ్ పై ట్రేడ్ లో మంచి అంచనాలున్నాయి. ఆయా షేర్, ఏషనాగుల సాంగ్స్ అన్ని సినిమాపై అంచనాలని క్రియేట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యాయి. దానితో ది ప్యారడైజ్ డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీపడ్డాయి.

ఫైనల్ గా బిగ్ డీల్ తో ది ప్యారడైజ్ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. సో ప్యారడైజ్ మూవీ ఓటీటీ పార్ట్నర్ గా నెట్ ఫ్లిక్స్ పేరు టైటిల్ కార్డ్స్ లో వేశారు మేకర్స్ ఇక ప్యారడైజ్ చిత్రాన్ని నాలుగు వారాల థియేట్రికల్ గ్యాప్ కమిట్మెంట్ తో నెట్ ఫ్లిక్స్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. 
 

The Paradise OTT Rights Bagged by This Platform