ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Shah Rukh Khan's Net Worth Drops by Rs 2500 Cr

2,500 కోట్లు క‌రిగిపోయినా నంబ‌ర్‌.1 హీరో

Shah Rukh Khan's Net Worth Drops by Rs 2500 CrShah Rukh Khan's Net Worth Drops by Rs 2500 Cr

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 విడుదల చేసిన నివేదిక ప్రకారం.. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నికర విలువలో గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ. 2,490 కోట్ల భారీ తగ్గుదల నమోదైంది. గతేడాది రూ. 12,490 కోట్లుగా ఉన్న సంపద ప్రస్తుతం రూ. 10,000 కోట్లకు చేరింది.

రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, నైట్ రైడర్స్ స్పోర్ట్స్ వంటి వ్యాపారాలు ఆయన సంపదకు మూలస్తంభాలుగా ఉన్నా మార్కెట్ ఒడుదొడుకుల కారణంగా ఈ క్షీణత చోటుచేసుకుంది.  అమితాబ్ బచ్చన్ (రూ. 4,000 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ. 3,000 కోట్లు), హృతిక్ రోషన్ (రూ. 2,500 కోట్లు) వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి కింగ్ ఖాన్ భారతదేశపు అత్యంత సంపన్నుడైన నటుడిగా తన అగ్రస్థానాన్ని పదిలంగా కాపాడుకున్నారు.

ఇక వెండితెరపై తన ప్రభంజనాన్ని కొనసాగించేందుకు షారూఖ్ ఖాన్ సిద్ధమవుతున్నారు. 2023లో వచ్చిన `డం` తర్వాత ఖాన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక యాక్షన్ థ్రిల్లర్ `కింగ్` డిసెంబర్ 24న విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుహానా ఖాన్, దీపికా పదుకొనే, అనిల్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. వ్యాపార రంగంలో ఎన్ని హెచ్చుతగ్గులు ఎదురైనా ఎప్ప‌టికీ నంబ‌ర్ వ‌న్ స్థానంలో కింగ్ ఖాన్ కొన‌సాగ‌డం ఆస‌క్తిక‌రం.

Richest Indian Actor Shah Rukh Khan's Net Worth Dropped By Rs 2500 Crore