ప్రభాస్ పై ట్రోల్స్
Trolls on Prabhas
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆనంద పడాలో లేదంటే అనుకున్న సమయానికి సినిమాలు రిలీజ్ కాక సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తుంటే బాధపడాలో తెలియక నలిగిపోతున్నారు. ప్రభాస్ ఒకేసారి మూడు నాలుగు సినిమాలు సెట్ పై ఉంచుతున్నారు. రాజసాబ్ పూర్తి కాకముందే స్పిరిట్, ఫౌజీ చిత్రాలు స్టార్ట్ చేసారు.
ఈ చిత్రాలతో పాటుగా కల్కి 2 లైన్ లోకి వచ్చేసింది. స్పిరిటి, ఫౌజీ చిత్రాల షూటింగ్స్ ఒకేసారి చేస్తున్నారు. పది రోజులు ఫౌజీ కి పది రోజులు స్పిరిట్ అంటూ ప్రభాస్ బిజీగా మారారు. కానీ ప్రభాస్ డేట్స్ సరిగా లేక సినిమా రిలీజ్ డేట్స్ కి మారిపోతున్నాయి. ఇప్పుడు కూడా స్పిరిట్, ఫౌజీ అంటూ తిరుగుతున్న ప్రభాస్ ఫౌజీ ని డిసెంబర్ 3 నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
ఫౌజీ రిలీజ్ వాయిదా పడితే ఆ ఎఫెక్ట్ స్పిరిట్ పై పడుతుంది. స్పిరిట్ రిలీజ్ 2027, మార్చ్. ఫౌజీ వాయిదా వల్ల స్పిరిట్ రిలీజ్ డేట్ మారొచ్చనే ఊహాగానాల నడుమ ప్రభాస్ సినిమాలు ఒప్పుకోవడం కాదు, అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేసి చూపించు అంటూ ఆయన్ను యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తున్నారు. అది చూసి ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలయ్యింది.







































