ఓటీటీకి వచ్చేస్తున్న ఇరుముడి
Irumudi OTT Release Date
థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మాస్ మహారాజ్ రవితేజ ఇరుముడి చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో అదిరిపోయే కలెక్షన్స్ తీసుకొస్తుంది. ఇరుముడి థియేటర్స్ లో రూ.250 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి రవితేజ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. శివ నిర్వాణ కథకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
తండ్రి-కూతుళ్ళ మధ్యన సాగే ఎమోషనల్ డ్రామాగా ఇరుముడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రవితేజ యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఆగష్టు 21 న థియేటర్స్ లో విడుదలైన ఫ్యామిలీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఓటీటీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడా క్షణం ఆసన్నమైంది.
ఇరుముడి ఓటీటీ హక్కులను భారీ డీల్ తో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకోగా.. ఇప్పుడా చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ నుంచి సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసారు. సో థియేటర్స్ లో మిస్ అయినా, లేదంటే మరోసారి చూడాలన్నా సెప్టెంబర్ 18 వరకు ఆగితే నెట్ ఫ్లిక్స్ నుంచి వీక్షించవచ్చు.







































