ఇక్కడ మెగాస్టార్ భార్య అక్కడ చిరు కుమార్తె
Sushmita Gets Key Role in Vijayawada Temple Development
మెగాస్టార్ భార్య సురేఖకు తెలంగాణ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తూ యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహస్వామి టెంపుల్ బోర్డు మెంబెర్ గా నియమించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం చిరు భార్య సురేఖకు కీలక పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఏపీలోనూ చిరు కుమార్తె కు ఇలాంటి ఓ బాధ్యతని అప్పజెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమర్తె సుష్మిత కొణిదెల విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి ఆలయ ట్రస్ట్ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్న సుశ్మితకు ఆంధ్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. దానితో సుస్మిత ఇకపై దుర్గమ్మ ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంకానున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న వసతులు, ఆలయంలో చేపట్టే అభివృద్ధి పనులు, దసరా నవరాత్రులు వంటి ప్రత్యేక ఉత్సవాల నిర్వహణపై ఆమె ట్రస్ట్ బోర్డుకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు.







































