నాని ప్లాన్ వర్కౌట్ అయ్యేలా..

Hero NaniHero Nani

 

దసరా చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ లో గట్టిగా కొట్టాలని హీరో నాని చాలా ఆరాటపడ్డాడు, అంతకుమించి కష్టపడ్డాడు. ప్రమోషన్స్ లోను చాలా క్రియేటివిటీ చూపించాడు. కానీ దసరా పాన్ ఇండియా మార్కెట్ లో అంతగా వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఈసారి ప్యారడైజ్ ని పాన్ ఇండియా మార్కెట్ కోసం సిద్ధం చేస్తున్నాడు.

ది ప్యారడైజ్ కోసం నాని ఎంతగా కష్టపడుతున్నాడో అతని లుక్ చూస్తే తెలుస్తుంది. ఆయా షేర్ అంటూ రచ్చ లేపిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ యెష నాగులు తో ప్యారడైజ్ పై అంచనాలు పెంచేసాడు. ఈ నెల 24 న పాన్ ఇండియా థియేటర్స్ లో విడుదలవుతున్న ప్యారడైజ్ పై హీరో నాని అంచనాలు పెంచేలా ప్లాన్ చేస్తున్నాడు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ప్యారడైజ్ ప్రమోషన్స్ కోసం నాని అండ్ కో రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారట. పాన్ ఇండియా మార్కెట్ లో సినిమాని బాగా ప్రమోట్ చేసి పాన్ ఇండియా ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ప్యారడైజ్ నుంచి కంటెంట్ వదిలేలా ప్లాన్ చేస్తున్నారట. ఈసారి ప్యారడైజ్ తో పాన్ ఇండియా మార్కెట్ ని దుళ్లగొట్టే ఏర్పాట్లలో నాని ఉన్నాడన్నమాట.

The Paradise movie