అలియా భట్ చేతిలో రెండు పాన్ ఇండియా ఫిలిమ్స్
Alia Bhatt bags 2 pan india films
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా ఫిలిం తో సౌత్ కి అందులోను టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. సీత పాత్రలో ఆర్.ఆర్.ఆర్ విజయంలో భాగమైన అలియా భట్ గ్యాప్ తీసుకుని మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని తన ఖాతాలో వేసుకోబోతుంది. అది కూడా బిగ్ స్కెల్ ఫిలిమ్స్ కావడం గమనార్హం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీలో అలియా భట్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం లో షాహిద్ కపూర్, అలాగే అలియా భట్ లు పాత్రలు చాలా ఇంపార్టెంట్ అని సమాచారం. ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతుంది.
ఇక అలియా భట్ నటిస్తున్న మరో క్రేజీ పాన్ ఇండియా ఫిలిం కల్కి 2. ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్ ఓ కీ రోల్ లో కనిపించనుంది అనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఈ రెండు బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల్లో అలియా భట్ కనిపించడం ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ అయినట్లే.







































