ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bethlehem Kudumba Unit Telugu Public Talk

మళయాళంలోనే కాదు తెలుగులోనూ హిట్టే!

Bethlehem Kudumba Unit Telugu Public TalkBethlehem Kudumba Unit Telugu Public Talk


మలయాళంలో ఫహద్ ఫాసిల్ మరో ఇద్దరు మిత్రులతో కలిసి నివిన్ పౌలి, మమిత బైజు కలయికలో నిర్మించిన బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ చిత్రం అక్కడ అనూహ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. గిరీష్ ఏడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి బిగ్ హిట్ గా నిలిచింది.

మలయాళంలో రూ.200 కోట్ల క్లబ్బులోకి చేరిన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేసారు. ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి రివ్యూస్ వస్తున్నాయి. నివిన్ పౌలి ఇంకా మమిత బైజు కెమిస్ట్రీ, నేచురల్ గా ఆకట్టుకున్న కామెడీ, అలాగే ఫ్రెష్ లవ్ స్టోరీ అన్ని యూత్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. మళయాళంలోనే కాదు తెలుగులోనూ బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ కి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది.

నెమ్మదిగా సాగే కథనం, ఇంకా ఊహలకందే సన్నివేశాలు మైనస్ లుగా నిలిచినా లవ్ స్టోరీ, కామెడీ కోసం ఆడియన్స్ బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

Bethlehem Kudumba Unit publ;ic talk