రూ.200 కోట్ల తో హ్యాట్రిక్ కొట్టిన హీరోయిన్
200-Crore Hat-Trick for Mamitha Baiju!
ఈ ఏడాది ఓ హీరోయిన్ కి బాగా కలిసొచ్చింది. ఆమె ప్రేమలు బ్యూటీ, మలయాళ హీరోయిన్ మమితా బైజు. రెండు నెలల్లో మూడు సినిమాల్తో రూ.200 కోట్ల క్లబ్బులోకి చేరి సడన్ గా టాప్ చైర్ ఎక్కేసింది. అందులో రెండు తమిళ మూవీస్, ఒకటి మలయాళ మూవీ. మమితా బైజు అదృష్టం ఎలా ఉంది అంటే కేవలం రెండు నెలలు రెండొందల కోట్ల సినిమాలు మూడు.
అందులో ముందుగా విజయ్ తో నటించిన జన నాయగన్ చిత్రంతో ముందుగా మూడొందల కోట్ల క్లబ్బులోకి చేరింది. కానీ ఆ చిత్రం హిట్ అవ్వలేదు. అయితేనేమి ఆ వెంటనే మరో కోలీవుడ్ హీరో సూర్య తో కలిసి విశ్వనాథ్ అండ్ సన్స్ తో రూ.250 కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టింది. తమిళనాట ఈ రెండు చిత్రాలు డిఫరెంట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలే.
ఇక మళయాలంలో మమితా బైజు నటించిన బెత్లెహెం కుటుంబ యూనిట్ రీసెంట్ గా రూ.200 కోట్ల క్లబ్బులోకి వెళ్ళింది. జులై, ఆగష్టు రెండే రెండు నెలలు మమిత బైజుని మూడు సినిమాలు వరసగా రూ.200 కోట్ల క్లబ్బులో నిలిపాయి. మూడు సినిమాలతో మమితా ఏకంగా రూ.750 కోట్లు కోట్లు కొల్లగొట్టి రెండు లాంగ్వేజెస్ లో టాప్ హీరోయిన్ గా మారిపోయింది.
మరి ఈ హీరోయిన్ ని ఇకపై స్టార్ హీరోల సినిమాల్లో కన్సిడర్ చేస్తారేమో చూడాలి, చూద్దాం మమిత బైజు అదృష్టం ఎలా ఉండబోతుందో అనేది.







































