ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nara Lokesh Calls Pawan His God-Gifted Brother

దేవుడిచ్చిన అన్న పవన్: నారా లోకేష్

Nara Lokesh Calls Pawan His God-Gifted BrotherNara Lokesh Calls Pawan His God-Gifted Brother


ఏపీ రాజకీయాల్లో మంత్రి నారా లోకేష్-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల కలయిక ఎపుడు ప్రజలకు, అభిమానులకు చాలా ఆసక్తిగా కనిపిస్తుంది. 2024 ఎన్నికల ముందు నుంచి పవన్ కళ్యాణ్, లోకేష్ మద్యన స్నేహం మొదలవడమే కాదు వారు ఒకరినొకరు గౌరవించుకునే తీరు అందరికి తెగ నచ్చేస్తుంది. లోకేష్ పవన్ ను అన్నలా గౌరవించడం, పవన్ లోకేష్ ను తమ్ముడిలా ట్రీట్ చెయ్యడం అన్ని ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తాయి.

ఈరోజు సెప్టెంబర్ 2 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఆయనకు సినీ, రాజకీయనాయకులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మిత్రుడు పవన్ కళ్యాణ్ ని విష్ చేస్తూ.. కోట్లాది మంది అభిమానులను అలరించిన పవన్.. రాజకీయ రంగంలోనూ ధైర్యవంతుడైన నాయకుడిగా నిలిచారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలిగించాలి.. అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక అన్నటికన్నా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ను విష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ అభిమానులకు పవర్ స్టార్, జనసైనికులకు సేనాని, నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవనన్న ఆయురారోగ్య ఆనందాలతో వందేళ్లు వర్థిల్లాలి. తెలుగు రాష్ట్రాల్లో పండగను తలపించేలా పవనన్న జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు అభినందనలు.. అంటూ లోకేష్ పవన్ ను ప్రేమతో విష్ చేసారు.

Nara Lokesh Treated Pawan Kalyan As His Own Brother