ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Manisha Koirala steps in to support Gen Z youth!

జెన్ జీ యువ‌త‌కు మ‌ద్ద‌తుగా రంగంలోకి మ‌నీషా కోయిరాలా!

Manisha Koirala steps in to support Gen Z youth!Manisha Koirala steps in to support Gen Z youth!

బాలీవుడ్ సీనియర్ నటి మనీషా కొయిరాలా పరిణతి చెందిన ఆలోచనలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా  జెన్ జీ యువ‌త  ఆలోచనా విధానం, అవినీతికి వ్యతిరేకంగా  చేస్తున్న పోరాటాలు , నాయకత్వ లక్షణాల గురించి పంచుకున్న అభిప్రాయాలు  జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో పేరుకుపోయిన వేళ్లూనుకున్న అవినీతిపై నేటి యువత గళం విప్ప‌డం, మార్పు కోసం పోరాడుతుండటాన్ని మనీషా కొయిరాలా పూర్తిగా సమర్థించారు.  

తమ వ్యక్తిగత ప్రయోజనాలే కాకుండా దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవడం అభినందనీయమని  పేర్కొన్నారు. యువతలో ఉండే  తెగింపు సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ఎంతైనా అవసరమని  అభిప్రాయపడ్డారు. కేవలం వయసులో చిన్నవారైనంత మాత్రాన ఎవరూ ఆటోమేటిక్‌గా మంచి నాయకులు కాలేరని ఆమె హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నాయకత్వ పగ్గాలు చేపట్టాలంటే ఉత్సాహం ఉంటే సరిపోదని, స్పష్టమైన దృష్టి, నిబద్ధత ,  బాధ్యతాయుతమైన ప్రవర్తన కీలకమని  స్పష్టం చేశారు. ట్రెండ్ కోసం కాకుండా లోతైన అవగాహనతో ముందుకు వెళ్లాలని యువతకు హితవు పలికారు.

దేశాన్ని ముందుకు నడిపించే నాయకులలో విజన్ లేకపోతే? ఎలాంటి సమస్యలు వస్తాయో వివరిస్తూ నేటి యువత భవిష్యత్తు నాయకులను ఎన్నుకునేటప్పుడు ఎంతో వివేకంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. చదువు, అనుభవం , సమాజం పట్ల బాధ్యత ఉన్నవారే అసలైన నాయకులుగా రాణించగలరని మ‌నీషా నమ్ముతున్నారు. నినాదాలతో సరిపెట్టకుండా ఆచరణాత్మకమైన మార్పు దిశగా అడుగులు వేయాలని సూచించారు.

Manisha Koirala