టాక్సిక్ రిజల్ట్ - నయనతార రియాక్షన్

Nayanthara about Toxic resultNayanthara about Toxic result



కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన టాక్సిక్ చిత్రం ఈ నెల 26 న విడుదలైంది. సినిమా విడుదలకు ముందు మంచి హైప్ ఉన్నా, విడుదలయ్యాకా సినిమాపై నెగిటివిటి బాగా కనిపించింది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ అద్భుతమైన స్టార్ క్యాస్ట్ పెట్టుకుని సినిమా తియ్యడం చేతకాలేదు అంటూ సోషల్ మీడియాలో టాక్సిక్ పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.

ఇక లేడీ సూపర్ నయనతార ఈ సినిమా ఎలా ఒప్పుకుంది అని అభిమానులు ఫీలవుతున్నారు. తాజాగా నయనతార ఓ ఇంటర్వ్యూలో టాక్సిక్ రిజల్ట్ పై ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యింది. నా కెరీర్ లో నేను ఒకటే నేర్చుకున్నాను, సినిమా హిట్ అయినా, లేదంటే ప్లాప్ అయినా ఆ సినిమా రిజల్ట్ ని ఒకేలా తీసుకోవడం, దానిని వినయంతో స్వీకరించడం నేర్చుకున్నాను.

అంతేకాదు సినిమాల విషయంలో ఇండస్ట్రీలో ఉన్న అనుభవం ఒక సినిమాను ఎలా తీస్తారనే దానిపై ప్రాథమిక అవగాహన ఇస్తుంది కానీ, సినిమా అనేది ఎంతో ఎమోషనల్ గా, ఊహకందని ట్విస్ట్ లతో  కూడుకున్నది. ఇక నేను నా కెరీర్‌లో పెద్ద హిట్ అవుతాయని నమ్మిన  కొన్ని సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

కానీ కొన్ని చిత్రాల రిజల్ట్స్ తేడా కొడుతుందేమో అనే సందేహాలు ఉన్న సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా భారీ విజయాలు సాధించి ఆశ్చర్యపరిచాయి అంటూ నయనతార టాక్సిక్ హిట్ అయినా, ప్లాప్ అయినా తనకెలాంటి ప్రాబ్లెమ్ లేదు అని చెప్పకనే చెప్పేసింది. 

Nayanthara