ఫౌజీ లో క్రేజీ ఫైట్ - ఇప్పుడిదే హాట్ టాపిక్
Fauzi’s Crazy Fight Becomes the Hot Topic
హను రాఘవపూడి డైరెక్షన్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ ఫౌజీ పై భారీ అంచనాలున్నాయి. ఫౌజీ నుంచి చాలా తక్కువ అప్ డేట్స్ వచ్చినా ఆ పోస్టర్ తోనే ఫౌజీ ప్రపంచాన్ని ఊహించుకుంటూ హను రాఘవాపుడిని ప్రభాస్ ఫ్యాన్స్ ఆకాశానికెత్తేస్తున్నారు.
తాజాగా హను రాఘవపూడి ఫౌజీ లోని యాక్షన్ సీక్వెన్స్ ని భారీ హైప్ ఇచ్చేలా డిజైన్ చేసారని, ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్-లక్షణ్ దర్శకత్వంలో ఫౌజీ ఫైట్స్ ని తెరకెక్కిస్తున్నారట. హైదరాబాద్ లోని ఆచార్య సెట్ లో తెరకెక్కించిన ఫౌజీ యాక్షన్ ఎపిసోడ్ అభిమానులే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది అంటున్నారు.
ప్రభాస్ అభిమానులు కావాల్సిన ఎలివేషన్స్‌తో పాటు.. ఆ సీన్లో ఒక ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉండేలా తెరకెక్కిస్తున్నారట. ఈ యాక్షన్ ఎపిసోడ్ లో ప్రభాస్ చేతిలో ఆయుధంతో, ఒళ్లంతా చందనం పూసుకుని, కళ్ల నిండా రౌద్రంతో ప్రత్యర్థులపై విరుచుకుపడే షాట్స్ సినిమాకే హైలెట్ కానున్నాయని తెలుస్తుంది.
ఇక ప్రభాస్ హను రాఘవపూడి మేకింగ్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని, హను దర్శకత్వం గురించి సన్నిహితులతో ప్రభాస్ గొప్పగా చర్చిస్తున్నారని, ప్రతి సీన్ ని ప్రభాస్ ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నారని యూనిట్ వర్గాల చెబుతున్నాయి.







































