ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
Vishwanath and Sons: Suriya Fixes Two Markets at Once
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ తో అటు తెలుగు, ఇటు తమిళ మర్కెట్ ని కొట్టేసారు. తెలుగులో సూర్య హవా చాలా తగ్గింది. ఆయన మర్కెట్ కూడా పడిపోయింది. వరస వైఫల్యాలతో సూర్య తెలుగు ప్రేక్షకులకు దూరమవుతున్న సమయంలో కరుప్పు తో కాస్త తెలుగు ఆడియన్స్ ని మెప్పించారు. అయినప్పటికీ కరుప్పు లో సూర్య గెస్ట్ రోల్ అని తెలుగు ప్రేక్షకులు డిసైడ్ చేశారు.
కానీ ఇప్పుడు తెలుగు దర్శకుడితో సూర్య చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం తెలుగు, తమిళ్ రెండు లాంగ్వేజెస్ లోను అద్భుతమైన టాక్ తెచ్చుకుని రన్ అవుతుంది. గత్ శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడమే కాదు భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. రెండో రోజు, మూడో రోజు కూడా విశ్వనాథ్ అండ్ సన్స్ థియేటర్స్ హౌస్ ఫుల్ తో కళకళలాడుతున్నాయి.
దానితో సూర్య తెలుగులోనూ హిట్ కొట్టారు, తమిళ్ మర్కెట్ ని పెంచుకున్నారు. ఇకపై సూర్య సినిమాలకు తెలుగులోనూ అదిరిపోయే రేట్లు పలకడం ఖాయం. సూర్య తెలుగు డైరెక్టర్ ని ఎంచుకుని, తెలుగు నిర్మాతతో సినిమా చెయ్యడం ఆయనకు బాగా కలిసొచ్చింది.
అందుకే అనేది.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అని, ఒక్క విశ్వనాథ్ అండ్ సన్స్ తో సూర్య అటు తెలుగు మర్కెట్ ని ఇటు తమిళ్ మర్కెట్ ని గాడిలో పడేసుకున్నారు.







































