థియేటర్స్ లో Mega 158 టైటిల్ గ్లింప్స్
Mega 158 Title glimpse in theaters
మెగాస్టార్ బర్త్ డే ఆగష్టు 22. చిరు బర్త్ డే అంటే మెగా ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ వేరే లెవల్ లో ఉంటాయి. కేక్ కటింగ్స్, కటౌట్ కి పాలాభిషేకాలు మాత్రమే కాదు.. ముఖ్యంగా మెగా అభిమానులు బ్లడ్ డొనేట్ చేస్తూ చిరు పై ప్రేమను, అభిమానాన్ని చాటుకుంటారు. ఇక మెగాస్టార్ చిరు బర్త్ డే కి ఆయన నటించే సినిమాల అప్ డేట్స్ కోసం అభిమానులు చాలా వెయిట్ చేస్తారు.
అందుకే దర్శకులు అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ ట్రీట్స్ సిద్ధం చేస్తారు. ప్రస్తుతం చిరు నటిస్తున్న మెగా 158 చిత్రం నుంచి దర్శకుడు కొల్లి బాబీ సూపర్ ట్రీట్ సిద్ధం చేస్తున్నారట. మెగా 158 టైటిల్ గ్లింప్స్ ని మెగా ఫ్యాన్స్ కి అందించబోతున్నాడట బాబీ. అది కూడా సెలెక్టెడ్ థియేటర్స్ లో ఈ టైటిల్ గ్లింప్స్ ని ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారట.
చిరు 158 టైటిల్ కదిరి కాకాజీ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి దర్శకుడు బాబీ మెగా 158 కోసం ఎలాంటి టైటిల్ సిద్ధం చేసారో అనేది మరో నాలుగు రోజుల్లో క్లారిటీ రాబోతుంది.







































