జన నాయగన్ స్ట్రీమింగ్ డేట్
Jana Nayagan To Stream From This Date
తమిళనాడు సీఎం విజయ్ లాస్ట్ చిత్రం జన నాయగన్ జులై 23 న థియేటర్స్ లో విడుదలైంది. గత ఆరు నెలలుగా పోస్ట్ పోన్ అయిన జన నాయగన్ చివరికి జులై 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విజయ్ చివరి చిత్రానికి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. తెలుగులో సినిమాకి డిజాస్టర్ రివ్యూస్ వచ్చాయి. తమిళనాట జన నాయగన్ యావరేజ్ ఫిలిం గా నిలిచింది.
ఎంతో గొప్పగా చివరి చిత్రంతో ఫేర్ వెల్ ఇద్దామనుకున్న విజయ్ ఫ్యాన్స్ కి జన నాయగన్ రిజల్ట్ షాకిచ్చింది. అయినప్పటికి జన నాయగన్ మూడు వందల కోట్ల క్లబ్బులో నిలిచింది. యావరేజ్ టాక్ కే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తే విజయ్ మరికాస్త మంచి మూవీ చేసినట్లయితే ఆయన చివరి చిత్రానికి అభిమానులు రూ.1000 కోట్లు కట్టబెట్టేవారే.
ఇక ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్దమైంది. జన నాయగన్ చిత్ర డిజిటల్ హక్కులను ముందుగా అమెజాన్ ప్రైమ్ భారీ డీల్ తో దక్కించుకుని సినిమా విడుదల లేట్ అవడంతో ఆ డీల్ ని క్యాన్సిల్ చేసుకుంది. ఆతర్వాత జన నాయగన్ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది. ఇప్పుడు జీ 5 జన నాయగన్ ఓటీటీ డేట్ లాక్ చేసింది.
ఆగష్టు 21 నుంచి జన నాయగన్ చిత్రం ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి తేబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసారు.







































