అక్కడ విమర్శలు - ఇక్కడ ప్రశంశలు
Actress Mamitha Baiju
తమిళనాట జులై లో విడుదలైన జన నాయకుడు చిత్రంలో నటించిన మమిత బైజు నటనపై తెలుగు, తమిళ్ భాషల్లోనూ తీవ్ర విమర్శలొచ్చాయి. భగవంత్ కేసరిలో నటించిన శ్రీలీల నే చాలా బెటర్, జన నాయగన్ లో మమిత బైజు ఏడుపు చూస్తే చిరాకొచ్చింది. జన నాయగన్ ఫెయిల్యూర్ లో మమిత బైజు మెయిన్ అంటూ చాలామంది మాట్లాడుకున్నారు.
జన నాయగన్ లో మమిత బైజు పాత్రను, ఆమె నటనను తీవ్రంగా విమర్శించిన వారే ఇప్పుడు తెగ ప్రశంసిస్తున్నారు. ఆమె రీసెంట్ గా విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సూర్య తర్వాత మమిత బైజు నటనను తెగ పోగుడుతున్నారు.
సినీ విమర్శకులైతే ఆమె లుక్స్, ఆమె నటన గురించి పదే పదే మాట్లాడుతున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం మెయిన్ హైలెట్స్ లో మమిత బైజు నటన ఒకటి అని చెప్పడం చూస్తే జన నాయగన్ లో తిట్టిన వాళ్లే ఇప్పుడు విశ్వనాథ్ చూసి తెగ పొగుడుతున్నారు అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.







































