ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Suriya goes crazy with back to back hits

బ్యాక్ టు బ్యాక్ టు హిట్స్ తో క్రేజీగా సూర్య

Suriya goes crazy with back to back hits


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాలా రోజులుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. వరస సినిమాలు చేసినా సూర్య కి సరైన హిట్ పడడట్లేదు. కరోనా తర్వాత సూర్య మంచి హిట్ కొట్టిన సందర్భం లేదు. ఆర్ జె బాలాజీ దర్శకత్వంలో సూర్య నటించిన కరుప్పు ఈ ఏడాది అద్భుతమైన హిట్ అయ్యింది.

మొదటిసారి సూర్య ని రూ.300 కోట్ల క్లబ్బులో నిలబెట్టిన చిత్రం కరుప్పు. అయితే ఈ చిత్రంలో సూర్య గెస్ట్ రోల్ చేసారా అనేలా ఆర్ జె బాలాజీ సూర్య రోల్ డిజైన్ చేసినా ఆ హిట్ సూర్య ఖాతాలో బలంగా పడింది. ఆ చిత్రం తర్వాత తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తో తమిళ్ లాంగ్వేజ్ లో చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా నిన్న శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

అటు తమిళ్, ఇటు తెలుగు రెండు భాషల్లోనూ విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రానికి ఆడియన్స్, క్రిటిక్స్ ఓవరాల్ గా పాజిటివ్ రెస్పాన్స్ చూపిస్తున్నారు. సూర్య మళ్లీ గజినీ లో సంజయ్ రామస్వామిని గుర్తు చేసారు, సంజయ్ విశ్వనాథ్ పాత్రలో ఆయన నటనను పొగిడిన వారే కానీ, పొగడని వారు లేదు. ఈ చిత్రంతోనూ సూర్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసారు.

కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు చిత్రాలతో సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి ఇప్పుడు స్టార్ లిస్ట్ లో క్రేజీగా మారిపోయారు. ఈ దెబ్బకు సూర్య రెమ్యునరేషన్ కూడా పెరిగిపోతుంది.

Kollywood Hero Suriya