ఎన్టీఆర్-ప్రభాస్ ఇద్దరూ వెయిట్ చేయిస్తున్నారు

NTR and Prabhas


సలార్ చిత్రం తర్వాత బిగ్ బ్రేక్ తీసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ చిత్రాన్ని అనౌన్స్ చేసిన ఏడాదిన్నరకు పట్టాలెక్కించారు. సలార్ పార్ట్ 1 తర్వాత పార్ట్2 ని ప్రభాస్ తో ఇమ్మిడియట్ గా స్టార్ట్ చేస్తారనుకుంటే ప్రభాస్ కల్కి, రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ షూటింగ్స్ లైన్ లో పెట్టేసుకున్నారు. నీల్ కూడా ఎన్టీఆర్ తో మూవ్ అయ్యారు.

ఎన్టీఆర్ తో డ్రాగన్ మొదలు పెట్టాక హీరో వెయిట్ లాస్ కోసం కొన్ని నెలలు వెయిట్ చేసిన నీల్ ఆ తర్వాత సజావుగా షూటింగ్ చేసుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ భుజానికి ప్రమాదం జరిగి ఆపరేషన్ చేయించుకోవడంతో మరికొన్ని నెలలు వెయిటింగ్ నీల్ కి తప్పేలా లేదు. మరి ప్రశాంత్ నీల్ డ్రాగన్ బ్రేక్ లో సలార్ 2 పై ఫోకస్ పెడతారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

ప్రశాంత్ నీల్ సలార్2 పై ఫోకస్ పెట్టినప్పటికీ ప్రభాస్ మాత్రం నీల్ కి అప్పుడే డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఫౌజీ తర్వాత స్పిరిట్ ఫినిష్ చెయ్యాలి, ఆ ఆతర్వాత కల్కి 2 చెయ్యాల్సి ఉంది. సో దర్శకుడు ప్రశాంత్ నీల్ ని అటు ఎన్టీఆర్ ఇటు ప్రభాస్ ఇద్దరూ వెయిట్ చేయిస్తున్నారు. 
 

NTR and Prabhas