మాటల మాంత్రికుడికి గట్టి పోటీనే!

Trivikram vs Venky Atluri

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ కి పడిపోని ప్రేక్షకులు ఉండరు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి ఇలా ఆయన మాటలు అందించిన చిత్రాలే కాదు, త్రివిక్రం డైరెక్ట్ చేసిన అతడు, జల్సా, జులాయ్, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురములో ఇలా ప్రతి సినిమాలోని డైలాగ్స్ ని ప్రేక్షకులు థియేటర్స్ లో ఎంతగా ఎంజాయ్ చేసారో.. స్టిల్ ఇప్పటికి బుల్లితెరపై ప్రసారమైతే అంతే ఎంజాయ్ చేస్తున్నారు.

త్రివిక్రముడి డైలాగ్స్ వింటూ సినిమా చూస్తే సమయం ఎలా గడిచిందో కూడా తెలియదు. అలాంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి ఇప్పుడు గట్టిపోటి ఎదురైంది. అది కూడా వెంకీ అట్లూరి రూపంలో. లక్కీ భాస్కర్ తో డైలాగ్ రైటర్ గా నేషనల్ అవార్డు అందుకున్న వెంకీ అట్లూరి మరోమారు డైలాగ్స్ తో ప్రేక్షకుల మనసులు గెలిచేసారు.

వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం నిన్న శుక్రవారమే విడుదలై ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. వెంకీ అట్లూరి డైలాగ్స్ చూసి త్రివిక్రమ్ తో పోలుస్తూ కామెంట్లు పెడుతున్నారు. అది చూసాకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి వెంకీ అట్లూరి గట్టి పోటీనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Director Venky Atluri