సంక్రాంతి 2027: టార్గెట్ ఫిక్స్ చేసిన 4 సినిమాలు
Sankranthi 2027 Target fix
2027 సంక్రాంతి బాక్సాఫీసు బరి క్రేజీగా మారబోతుంది. ఇప్పటికే పలు సినిమాల కన్ను సంక్రాంతి పైనే పడింది. ఈ ఏడాది సంక్రాంతి చిత్రాలు ఎక్కువగా హిట్ అవడంతో 2027 సంక్రాంతి బరి హాట్ గా మారింది. చిరు-బాబీ మూవీ, బాలయ్య-గోపీచంద్ మూవీ, శర్వానంద్-శ్రీను వైట్ల కాంబో జార్జ్ క్రిష్, అనిల్ రావిపూడి-కళ్యాణ్ రామ్-వెంకీ కాంబో మూవీ, రవితేజ-శ్రీవిష్ణు కాంబో ఈమద్యలో సూపర్ స్టార్ ధర్మన్ డబ్బింగ్ మూవీస్ ఇలా చాలా సినిమాల కన్ను సంక్రాంతి పైనే ఉన్నాయి.
అయితే ఏ చిత్రాలు ఎలా ఉన్నా నాలుగు చిత్రాలు మాత్రం సీరియస్ గా సంక్రాంతి 2027 టార్గెట్ గా బరిలోకి దిగిపోయాయి. అందులో శర్వానంద్-శ్రీను వైట్ల కలయికలో స్టార్ట్ అయిన జార్జ్ క్రిష్ చిత్రం అలాగే అనిల్ రావిపూడి - వెంకీ-కళ్యాన్ రామ్ మూవీ, రవితేజ-శ్రీవిష్ణు కాంబో మూవీస్ పక్కాగా సంక్రాంతి 2027 కి ఫిక్స్ అయ్యాయి.
తాజాగా ప్రశాంత్ వర్మ మహాకాళి కూడా సంక్రాంతి 2027 అంటూ చెప్పడం క్రేజీగా మారింది. మరి ఈ నాలుగు చిత్రాలు సంక్రాంతి టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నాయి. డిసెంబర్ లోపు ఇంకెన్ని చిత్రాలు సంక్రాంతి బాక్సాఫీసు పై కచ్చిఫ్ వేస్తాయో తెలియాలి.







































