ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Superstar To Arrive Twice In Three Months

సూపర్ స్టార్ బ్యాక్ టు బ్యాక్ రిలీజులు

Superstar To Arrive Twice In Three Months

 

సూపర్ స్టార్ రజినీకాంత్ స్పీడు చూస్తే కుర్ర హీరోలకు వెన్నులో ఒణుకు రావాల్సిందే. యంగ్ హీరో లు కూడా ఆ స్పీడులో షూటింగ్స్ లో పాల్గొన్నారేమో అన్నట్టుగా రజినీకాంత్ సినిమాలు చేస్తున్నారు. జైలర్ 2 షూట్ ఫినిష్ అయ్యిందో లేదో ధర్మన్ సెట్ లోకి వెళ్ళిపోయి అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసి సెకండ్ షెడ్యూల్ కి వెళ్లిపోయారు.

తాజాగా జైలర్ 2 రిలీజ్ అయిన మూడు నెలలకే ధర్మన్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారనే వార్త సోషల్ మీడియా ని కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులను షేక్ చేస్తుంది. జైలర్ 2 అక్టోబర్ 15 న విడుదలవుతుంటే.. ధర్మన్ చిత్రాన్ని 2027 పొంగల్ కి సిద్ధం చేస్తున్నారనే వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

మరి కేవలం మూడు నెలల్లో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ని విడుదల చెయ్యడం అంటే మాములు విషయం కాదు. కమల్ హాసన్ ప్రొడక్షన్ లో రజిని-కమల్ కలయికలో ఈ మల్టీస్టారర్ ధర్మన్ తెరకెక్కుతుంది. ఈ చిత్రం జైలర్ 2 వచ్చిన మూడు నెలలకే విడుదల సాద్యమవుతుందో, లేదో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

Rajinikanth Jailer 2 And Dharman Release Dates Confirmed