స్ట్రీమింగ్ లోకి వచ్చేసిన లెనిన్

Lenin streaming now on Zee5

 

అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ లెనిన్. ఈ చిత్రం జులై 10 న థియేటర్స్ లో విడుదలైంది. లెనిన్ చిత్రంతో అఖిల్ ఫీస్ట్ సూపర్ హిట్ అందుకున్నాడు. లెనిన్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో లెనిన్ చిత్రం లాంగ్ రన్ లో రూ.100 కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చింది.

అఖిల్ లెనిన్ తో మొదటసారి అఫీషియల్ గా రూ.100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. లెనిన్ డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 ఇప్పుడు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.

ఈ రోజు అంటే ఆగష్టు 7 నుంచి జీ 5 లో లెనిన్ స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్స్ లో లెనిన్ ని మిస్ అయినవారు ఇప్పుడు జీ 5 లో వీక్షించేయ్యండి. 

Lenin is set to premiere on Zee5 on August 7