టాప్ డైరెక్టర్ సినిమా ఇంత చప్పగానా ?
Lokesh Kanagaraj Dc releasing tomorrow
కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. కోలీవుడ్ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ నిన్నటి వరకు తెరవెనుకే ఉన్నారు. కానీ రేపటి నుంచి తెరపైన కనిపించబోతున్నారు. హీరోగా ఆయన నటించిన డెబ్యూ చిత్రం రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది.
డీసీ గా లోకేష్ కనగరాజ్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దర్శకుడిగా టాప్ పొజిషన్ ని ఎంజాయ్ చేసిన లోకేష్ కనగరాజ్ కూలి తో కాస్త డల్ అయ్యాడు. కూలి తర్వాత ఆయన హీరోగా డీసీ సినిమా తెరకెక్కింది. మరి అలాంటి దర్శకుడు హీరోగా పరిచయం అవుతున్నాడు ఆటేఆ సినిమాపై క్రేజ్ బాగా ఉండాలి.
కానీ లోకేష్ కనగరాజ్ డీసీ పై ఎలాంటి హైప్ లేదు, అసలు బజ్ క్రియేట్ అవ్వలేదు, ఆడియన్స్ లో ఆసక్తి కనిపించడం లేదు. రేపు సినిమా రిలీజ్, కానీ ఎక్కడా లోకేష్ కనగరాజ్ సినిమా ముచ్చట వినిపించడమే లేదు. చూద్దాం సినిమా కి హిట్ టాక్ వస్తే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారేమో. ఆదరిస్తేరేమో అనేది.







































