బంగారు వ్యాపారిని మోసం చేసిన సల్మాన్?
Chandigarh court issues notices to Salman Khan
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటారు. ఇప్పుడు మరోసారి సల్మాన్ ఖాన్ పై బంగారు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఛండీగఢ్‌లోని బంగారు వ్యాపారిని సల్మాన్ ఖాన్ మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఛండీగఢ్‌లోని బంగారు వ్యాపారి అరుణ్ గుప్తా దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. 2018లో బీయింగ్ హ్యూమన్ జ్యువెలరీ ఫ్రాంచైజీ స్టోర్ ని ప్రారంభించేందుకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పెట్టుబడి పెట్టామని, ఈ షోరూమ్ ప్రారంభోత్సవానికి సల్మాన్ ఖాన్ స్వయంగా వస్తారని అంతేకాకుండా..
బ్రాండ్ ప్రమోషన్లతో పాటు క్రమం తప్పకుండా ప్రొడక్ట్స్ స్టాక్ పంపుతామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. కానీ తమకిచ్చిన హామీ ప్రకారం ఎలాంటి స్టాక్ సరఫరా చేయలేదని, ఆయన ప్రమోషన్లు కూడా నిర్వహించలేదని, పైగా తమ బకాయిలపై స్పందించడం లేదని సల్మాన్ ఖాన్ పై ఫిర్యాదు చెయ్యగా.. వ్యాపారి ఫిర్యాదు మేరకు సల్మాన్‌ఖాన్‌కు ఛండీగఢ్ కోర్టు సమన్లు పంపింది. మరి కోర్టు నోటీసులపై సల్మాన్ ఖాన్ ఎలా స్పందిస్తారో చూడాలి.







































