నాగ్ బర్త్ డే కి కింగ్ 100 స్పెషల్ ట్రీట్
King100 special treat for Nag's birthday
కింగ్ నాగార్జున 100 వ చిత్రానికి సంబందించిన అప్ డేట్ కోసం అక్కినేని అభిమానులు వెయిటింగ్. లెనిన్ చిత్రం 100 కోట్ల క్లబ్బులోకి చేరడంతో అభిమానులు రిలాక్స్ అయ్యారు. ఆ ఊపులోనే వారు కింగ్ 100 అప్ డేట్ ని కోరుకుంటున్నారు. నాగార్జున ఆచి తూచి తమిళ్ డైరెక్టర్ కార్తీక్ తో తన 100 వ చిత్రాన్ని స్టార్ట్ చేసారు.
ఈ చిత్రంలో టబు నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంటర్ అవడం తప్ప ఈ చిత్రానికి సంబందించిన ఏ విషయము బయటకు రాలేదు. కింగ్ నాగ్ తాజాగా బిగ్ బాస్ ప్రోమో షూట్ లో తన 100 వ సినిమా ఫస్ట్ లుక్ రెడీ అవుతుంది అని చెప్పారు. అది కింగ్ నాగ్ బర్త్ డే కి KING 100 నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే కాకుండా టైటిల్ గ్లింప్స్ కూడా రెడీ చేస్తున్నారట.
నాగ్ బర్త్ డే కి ఇంకా 25 రోజుల సమయముంది. మరి కింగ్ 100 టైటిల్ విషయంలో పలు రకాల ఊహాగానాలు ప్రచారం లో ఉన్నాయి. వాటన్నిటికీ నాగ్ బర్త్ డే కి ఓ క్లారిటీ ఇవ్వబోతున్నారు మేకర్స్.







































