ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Keerthy Suresh working nonstop with multiple film shoots

కీర్తి సురేష్ ఇంత బిజినా?

Keerthy Suresh working nonstop with multiple film shoots

 

మహానటి కీర్తి సురేష్ కి పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గాయి. బాలీవుడ్ కి వెళ్ళొచ్చాక కీర్తి సురేష్ హడావిడి సినిమాల్లో తగ్గింది. టాలీవుడ్ లో అమ్మడుకి అవకాశాలు తగ్గాయనుకుంటున్న సమయంలో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్ధన, వెంకీ సరసన అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ వచ్చింది. అందులో మరో హీరోయిన్ కృతి శెట్టి కూడా ఉంది.

మలయాళం, హిందీ, తమిళ ప్రాజెక్ట్స్ అంటూ క్షణం తీరిక లేని బిజీలో కీర్తి సురేష్ ఉంటుంది. అదే విషయాన్ని ఆమె చెబుతూ రోజుకి 20 గంటల పనితో అలిసిపోయాను అంటూ ఆమె పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. నిన్నటివరకు అవకాశాలు లేవు అంటూ కీర్తి గురించి మట్లాడుకున్న వారికి కీర్తి సురేష్ చేతిలో సినిమాలు, వాటి షూటింగ్స్ తో ఆమె ఎంత బిజినో అర్ధమైంది. 

నిన్న ఈ వీడియోను పోస్ట్ చేసే ఓపిక కూడా నాకు లేదు. ఒక సినిమా షూటింగ్ నుంచి మరో సినిమా షూటింగ్ కి వెళ్తూనే ఉన్నా. నిన్న మార్నింగ్ 6 కి నా రూమ్ నుంచి బయలుదేరాను. మళ్లీ ఇప్పుడు ఉదయం 6 అవుతోంది. దాదాపు 24 గంటల తర్వాత నా గదిలోకి అడుగుపెట్టాను. అందులో 20 గంటల పాటు పనిలోనే ఉన్నాను.

అసలు విషయం ఏమిటంటే.. మళ్లీ ఇంకో గంటలో నా తర్వాతి షూటింగ్ కోసం బయలుదేరాలి. ఇది నేను అలసటలా అస్సలు ఫీల్ అవ్వను, దీన్ని నేను ఓ ఆశీర్వాదంగా భావిస్తున్నాను అంటూ కీర్తి సురేష్ చేతినిండా సినిమాలతో, వాటిస్ షూటింగ్స్ తో తనెంత బిజీ నో చెప్పేసింది. 

Keerthy Suresh