ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Varanasi: Nothing special from Rajamouli on Mahesh B-Day

మహేష్ బర్త్ డే: వారణాసి ట్రీట్ అదేనా?

Varanasi: Nothing special from Rajamouli on Mahesh B-Day

 

మరో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే. బర్త్ డే సెలెబ్రేషన్ కోసం మహేష్ కొడుకు గౌతమ్ తో కలిసి విదేశాలకు వెళ్లిపోయారు. మహేష్ తన బర్త్ డే కి ఏదో ఒక దేశం ఎంచుకుని ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లడం అలవాటు. అలానే ఈ ఏడాది కూడా సూపర్ స్టార్ మహేష్  సింగపూర్ వెకేషన్ కు వెళ్లారు.

ప్రస్తుతం ఆయన భార్య నమ్రత, కుమార్తె సితార అక్కడే సింగపూర్ ఉన్నారు.ఇక మహేష్ ఫ్యాన్స్ అయితే ఆయన నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం వారణాసి నుంచి ఎలాంటి ట్రీట్ రాబోతుందో అనే క్యూరియాసిటిలో ఉన్నారు. రాజమౌళి మహేష్ ఫ్యాన్స్ కి ఎలాంటి సర్ ప్రైజ్ సిద్ధం చేస్తున్నారో అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి గత ఏడాది మహేష్ బర్త్ డే కి ఫ్యాన్స్ డిజప్పాయింట్ చేసారు.

కానీ ఈ ఏడాది మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రియాంక చోప్రా బర్త్ డే కి కొన్ని ఫొటోస్ వదిలి ఆమెకు బర్త్ డే విషెస్ చేప్పినట్టుగా సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే కి అలానే మాసివ్ ఫోటో గ్రాఫ్స్ వదిలేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. మరి మహేష్ ఫ్యాన్స్ మహేష్ వారణాసి వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.

కేవలం మహేష్ స్టిల్స్ అంటే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియాలి. చూద్దాం రాజమౌళి మహేష్ ఫ్యాన్స్ కి ఇచ్చే ఆ ట్రీట్ ఏమిటి అనేది.

Varanasi: Nothing special on Special Day