టాక్సిక్ ట్రైలర్ - నెగిటివిటి మార్చేస్తుందా?

Toxic Trailer on aug 8th

 

ప్రస్తుతం కన్నడ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ చిత్రం పై పాన్ ఇండియా మార్కెట్ లో ఏమంత పోజిటివ్ బజ్ లేదు. ముందు నుంచి టాక్సిక్ చిత్రం పెద్దవాళ్లకు మాత్రమే అని చెప్పి మరీ బోల్డ్ కంటెంట్ తో సినిమా తీసారా అనేలా టీజర్, టాక్సిక్ నుంచి వచ్చిన రెండు పాటలు ఉన్నాయి.

దానితో యశ్ టాక్సిక్ పై చాలా చోట్ల నెగిటివిటి కనిపించింది. మరి రేపు శనివారం బెంగుళూరులో విడుదల కాబోయే టాక్సిక్ ట్రైలర్ ఏమైనా ఈ నెగిటివిటీని దూరం చేస్తుందా, ఇప్పుడు అందరి కళ్ళు టాక్సిక్ ట్రైలర్ పైనే ఉంది. టాక్సిక్ ట్రైలర్ ప్రస్తుతం ఉన్న నెగిటివిటీని దూరం చేస్తుందా అని.

ఇక ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో యశ్ తో పాటుగా హీరోయిన్స్ నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తార సుతారియా ఇలా టాక్సిక్ లో నటించిన హీరోయిన్స్ అందరూ పాల్గొంటారని... టాక్సిక్ ట్రైలర్ ఈవెంట్ కలర్ ఫుల్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది. 

All Eyes on Toxic Trailer