ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pradeep Singh Rawat Dies of Blood Cancer

ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ మృతి

Pradeep Singh Rawat Dies of Blood Cancer

 

తెలుగు సినిమాల్లో తనదైన విలనిజంలో ఆడియన్స్ ను భయపెట్టిన ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ ముంబైలో బ్లడ్ క్యాన్సర్ మృతి చెందడం అందరిని షాక్ కి గురి చేసింది.1952 జనవరి 21న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించిన ప్రదీప్ రావత్.. తెలుగులో సై సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.

ఆతర్వాత ఛత్రపతి, గజిని చిత్రాల్లో విలన్‌గా నటించి ప్రదీప్‌ రావత్‌ పాపులర్ అయ్యారు. సై మూవీలో బిక్షుయాదవ్‌గా, ఛత్రపతి సినిమాలో రాజ్‌ బిహారి పాత్ర భద్ర, దేశముదురు, స్టాలిన్‌, ఓయ్‌, నేను శైలజతో పాటు.. అనేక తెలుగు సినిమాల్లో నటించిన ప్రదీప్‌ రావత్ ఈ రోజు మంగళవారం సాయంత్రం 5:30pm క్యాన్సర్ తో బాధపడుతూ తుది శ్వాస విడిచారు.

ప్రదీప్‌ రావత్‌ మరణించిన విషయం తెలిసి ఆయనతో పని చేసిన నటులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.
 

Veteran actor Pradeep Rawat has passed away at the age of 74