రామాయణ: అప్పుడే కాంట్రవర్సీ మొదలు
Ramayana Hits Controversy Months Before Diwali Release
బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రామాయణ పార్ట్ 1 విడుదలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. ఈలోపే రామాయణ పై కాంట్రవర్సీలు మొదలయ్యాయి. ఢిల్లీ లోని శ్రీ రామ్ లీలా మహా సంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ దివాళి కి విడుదల కాబోతున్న రామాయణపై ఆందోళనను వ్యక్తం చేస్తూ అప్పుడే రామాయణ టీమ్ కి లేఖ రాయడం చర్చనీయాంశం అయ్యింది.
రామాయణ టీజర్, రామాయణ ట్రైలర్ చూసాక తమకు కొన్ని విషయాల్లో అభ్యంతరాలు మొదలయ్యాయని, రామాయణ చిత్రం కోసం ఎన్నో లక్షలమంది ఎదురు చూస్తున్నారు, మేము స్వాగతిస్తున్నాము, కానీ ట్రైలర్ చూసాక మాకు కొద్దిగా బాధ కలిగించింది. అందులోని కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు సరిగ్గా లేవని మాకు అనిపించింది.
అంతేకాకుండా సినిమాలో నటించిన ఆర్టిస్ట్ ల కాస్ట్యూమ్స్ కూడా కొన్ని సన్నివేశాల్లో ఆమోదయోగ్యంగా లేవు. అందుకే రామాయణ విడుదలకు ముందు మాకు కచ్చితంగా చూపించాలి, మేము కూడా రామ్ లీల కమిటీ సభ్యుల కోసం ఉచిత ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తాం.. కానీ మేము ముందు సినిమా చూడాలి అంటూ ఆయన డిమాండ్ చేస్తూ లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది.







































