అన్ని ప్లాన్స్ - అందరి హోప్స్ కొలాప్స్

Stars-Plans


ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలే కాదు ఆఖరికి స్టార్ హీరోయిన్ కూడా ప్రమాదాల బారిన పడి సినిమా షూటింగ్ కి బ్రేకిచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సర్జరీ జరగగా.. రామ్ చరణ్ మణికట్టు కి ఆపరేషాన్ జరిగింది. బాలయ్య కు మోకాలి ఆపరేషన్ జరగగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది.

రష్మిక మందన్న కు సినిమా సెట్ లో తీవ్రమైన గాయమవగా.. వీరంతా దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు రెస్ట్ తీసుకుంటున్నారు. దానితో బాలయ్య నటిస్తున్న NBK 111 షూటింగ్ వాయిదా పడి రిలీజ్ ప్లాన్స్ మారిపోయాయి. ఇక ఎన్టీఆర్ కి ప్రమాదం జరగడంతో డ్రాగన్ షూటింగ్ వాయిదా పడింది.

రామ్ చరణ్ మణికట్టు సర్జరీ తో ఆయన మొదలు పెట్టాల్సిన RC 17 ప్రాజెక్ట్ లేట్ గా మొదలు కాబోతుంది. ఇక రష్మిక నటిస్తున్న మైసా, రణబాలి రెండు ప్రాజెక్ట్స్ షూటింగ్ కి బ్రేకిచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ భుజానికి సర్జరీతో OG 2 స్టార్ట్ అవడానికి చాలా సమయమే పడుతుంది.

ఇలా హీరోలు గాయాలపాలవడంతో అన్ని ప్లాన్స్, అందరి అంటే అభిమానుల హోప్స్ అన్ని కొలాప్స్ అయ్యాయి.

 

Tollywood