ఈ నిరసనతో జగన్ కు కనువిప్పు కలిగేనా?
Borugadda Anil Kumar has staged protest at YS Jagan house at Tadepall
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ చుట్టూ నలుగురు కోటరి గా గోడ కట్టి జగన్ కు సమస్యలు తెలియకుండా చేసారు, అందులో ముఖ్యంగా సజ్జల రామకృష్ణ రెడ్డి, జగన్ ను డమ్మీని చేసి ఆడుకున్నారు, ఆయనే సీఎం అన్న రేంజ్ లో సజ్జల వ్యవహరించేవారు. జగన్ ను కలవాలంటే వీళ్ళ పర్మిషన్ తప్పనిసరి అంటూ కొంతమంది వైసీపీ నేతలు, బ్లూ మీడియా బహిరంగంగానే సజ్జలపై జగన్ కు వినిపించేలా గోల చేశారు.
ఇప్పుడు అధికారం పోయాక కూడా జగన్ ను డమ్మీని చేసి సజ్జల ఆడిస్తున్నాడా? ఇప్పటికి జగన్ మోహన్ రెడ్డి సజ్జల విషయంలో కళ్ళు తెరవలేదా? లేదంటే మళ్లీ జగన్ ఇలాకాలో అలాంటి నిరసన కార్యక్రమమా? అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. జగన్ ను నమ్మిన నేతలు సజ్జల వల్ల వైసీపీ కి దూరమైపోతున్నారు అనడానికి మరో ఉదాహరణ బోరుగడ్డ అనిల్.
జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను నరికేస్తా చంపేస్తా అంటూ కారుకూతలతో రెచ్చిపోయి కూటమి ప్రభుత్వం వచ్చాక అరెస్ట్ అయ్యి లోపలాకెళ్లిన బోరుగడ్డని జగన్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ తాడేపల్లి జగన్ నివాసం ముంచి నిరసన చేపట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
తనను జగన్‌ను కలవకుండా మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా సజ్జల తన అనుచరుల ద్వారా తనపై రౌడీషీటర్ అనే ప్రచారం చేయిస్తున్నారని బోరుగడ్డ అనిల్ విమర్శించారు. తనపై ఎలాంటి రౌడీషీట్ లేదని హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ, తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్న వారిపై ఇప్పటికే న్యాయపరమైన నోటీసులు జారీ చేశామని తెలిపారు.
తనను రౌడీషీటర్‌గా అభివర్ణించి పరువునష్టం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను బోరుగడ్డ అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. మరి జగన్ కు సజ్జల విషయమై ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందో, లేదో మరి.







































