ఉదయనిధి అరెస్ట్ తో పరువు పోగొట్టుకున్నారు
Udhayanidhi Released
తమిళనాడు ప్రభుత్వం ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ తో పరువు పోగొట్టుకుంది. ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్ పేరు ని డైరెక్ట్ గా, నటి త్రిష పేరుని ఇండైరెక్ట్ గా ఉచ్చరిస్తూ చేసిన కామెంట్స్ తో ఉదయనిధిపై కేసు నమోదు కావడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు తమిళనాడు పోలీసులు ఉత్సాహం చూపించారు.
ఎలాంటి నోటీసులు లేకుండా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బెయిల్ కోసం ఉదయనిధి హైకోర్టు ను ఆశ్రయించారు. ఈరోజు ఆ కేసు విచారణకు రావాల్సి ఉంది, మధ్యాన్నం లోపే తీర్పు వస్తోంది అన్న తరుణంలో ఉదయనిధి స్టాలిన్ ని హడావిడిగా అరెస్ట్ చేసారు.
కోర్టు అడిగితే నీళ్లు నమిలిన పోలీసులు.. అసలు ఉదయనిధిని పోలీస్ కస్టడీలోనే ఉంచే ఉద్దేశం తమకు లేదని, విచారణ పూర్తయిన వెంటనే స్టేషన్ బెయిల్‌పై విడుదల చేస్తామని అడ్వకేట్ జనరల్ మద్రాస్ హైకోర్టుకు చెప్పారు. ఈ ఉదంతంతో విజయ్ ప్రభుత్వానికి నష్టం వాటిల్లడం ఖాయమనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.







































