బర్త్ డే వెకేషన్ కి సూపర్ స్టార్
Mahesh Babu off from hyd for Birthday vacation
సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్దిరోజుల క్రితమే వెకేషన్ కి వెళ్లొచ్చారు. పాన్ ఇండియా ఫిలిం వారణాసి చిత్రం షూటింగ్ లో తలమునకలై ఉన్న మహేష్ బాబు మరోసారి వెకేషన్ ప్లాన్ చేసుకున్నారు. అది కూడా ఆయన బర్త్ డే వెకేషన్. కొడుకు గౌతమ్ తో కలిసి మహేష్ బాబు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.
దానితో సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే వెకేషన్ కు విదేశాలకు వెళుతున్నారంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఆగష్టు 9 న మహేష్ బర్త్ డే. ఆ రోజు రాబోయే వారణాసి ట్రీట్ కోసం మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ కూడా సిద్ధమవుతుంటే మహేష్ తన బర్త్ డే కోసం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చెయ్యబోతున్నారు.
వారణాసి షూటింగ్ 80 శాతం పూర్తి కాగా.. మరో 20 శాతం చిన్న చిన్న సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నట్లుగా రీసెంట్ గా దర్శకుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. మహేష్ వెకేషన్ నుంచి రాగానే రాజమౌళి ఆ మిగతా షూటింగ్ కంప్లీట్ చేస్తారని తెలుస్తుంది.







































