ఉదయనిధి అరెస్ట్-తమిళనాడులో ఉద్రిక్తత

Udhayanidhi Stalin arrested


DMK నేత, మాజీ డిప్యుటి సీఎం ఉదయనిధి స్టాలిన్ ని పోలీసులు అరెస్ట్ చెయ్యడం తీవ్ర చర్చనీయాంశమైంది. తమిళనాడు సీఎం విజయ్, అలాగే నటి త్రిష పై ఉదయనిధి స్టాలిన్ వ్యంగ్యంగా చేసిన కామెంట్స్ పై కేసు నమోదు కాగా ఈరోజు మంగళవారం ఉదయనిధి స్టాలిన్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తో DMK కార్యకర్తలు, నేతలు అందరూ పోలీసులకు అడ్డుతగిలారు.

అసలు ఉదయనిధిని ఎందుకు అరెస్ట్ చెయ్యాల్సి వచ్చింది అంటే.. కావేరి జలాల అంశంపై తంజావూరులో నిన్న సోమవారం DMK నిరసన చేపట్టింది. ఈ నిరసనలో పాల్గొన్న ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. అక్కడ ఉదయనిధి మాట్లాడుతూ.. విజయ్ ప్రభుత్వ అసమర్థతతో తమిళనాడుకు చుక్క కావేరి నీళ్లు రావడం లేదని నిప్పులు చెరిగారు.

ఉదయనిధి అక్కడ ప్రసంగిస్తుండగా కొందరు త్రిష.. త్రిష అంటూ కొంతమంది నినాదాలు చేస్తూ హడావిడి చెయ్యడంతో ఉదయనిధి నవ్వుతూ.. నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి చేరాలి అంటూ మాట్లాడారు. అంతేకాదు తాను కేవలం కావేరి జలాల గురించే మాట్లాడుతున్నానని వ్యంగ్యంగా అనడంతో ఉదయనిధి ఇండైరెక్ట్ గా సీఎం విజయ్, త్రిషను ఉద్దేశించే కామెంట్స్ చేసారు అంటూ టీవీకే నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు.

ఈ క్రమంలోనే ఉదయనిధి వ్యాఖ్యలపై టీవీకే నేతలు తంజావూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. టీవీకే నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు ఉదయనిధి స్టాలిన్ పై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసారు.

Udhayanidhi Stalin Detained: Political Storm In Tamil Nadu