ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jason - Seeing my appa as Chief Minister is a historic revolution

తండ్రి విజయ్-తల్లి సంగీత పై జాసన్ కామెంట్స్

Jason - Seeing my appa as Chief Minister is a historic revolution


తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విజయ్ త్వరలోనే డెబ్యూ డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీ కి ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. తాను డైరెక్ట్ చేసిన సిగ్మా చిత్ర ప్రమోషన్స్ లో జాసన్ చాలా విషయాలు మీడియాతో పంచుకుంటున్నారు. తాజాగా తన తండ్రి విజయ్ పొలిటికల్ ఎంట్రీపై అలాగే తన తల్లి సంగీత పై జాసన్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మా నాన్న విజయ్ తమిళనాడు సీఎం అవడం ఓ రికార్డ్, ఓ విప్లవం. మేము ఆయన వారసత్వం కాపాడాలి. ఆయన సీఎం అయ్యాక నాకు, మా చెల్లికి, మా ఇంట్లో వాళ్లందరిపై రెస్పాన్సబిలిటీ పెరిగింది. నేను సినిమా ఇండస్ట్రీలోకి వస్తాను అంటే మా నాన్న విజయ్ నాకో సలహా ఇచ్చారు. సొంతంగా నా కాళ్ళ మీద నిలబడి, నాకంటూ ఓ పేరు, గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఏదైనా హెల్ప్ కావాలంటే అడగమన్నారు.

ఇక మా అమ్మ సంగీత స్పై అని చెప్పొచ్చు. నేను సీక్రెట్ గా ఏం చేసినా ఆమెకు దొరికిపోతుంటాను, బయటికెళ్లినా, అమ్మకు తెలియకుండా ఏం చేసినా అమ్మకు దొరికిపోతాను. అంతలా మా అమ్మ స్పై లా పని చేస్తుంది అంటూ జాసన్ తన తండ్రి విజయ, తల్లి సంగీత ల గురించి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

Jason Sanjay Reflects On Father Thalapathy Vijay