రవి మోహన్ పై మాజీ అత్తగారు ఫైర్
Aarthi Ravi's mother has reacted after a recent court order
కోలీవుడ్ హీరో రవి మోహన్ లైఫ్ లో డాన్స్ చేసుకుంటూ రిలాక్స్ అవుతున్నారు. నిన్నటివరకు మాజీ భార్య ఆర్తి ఆరళ్ళు, విడాకుల కేసు, భరణం గోల, కొత్త ప్రేయసి అంటూ సతమతమైన రవి మోహన్ కి చెన్నై ఫ్యామిలీ కోర్టు నెత్తిన పాలు పోసింది. భార్య ఆర్తితో విడివిడిగా ఉంటూ విడాకుల కోర్టులో ఉండగానే ఆర్తి రవిమోహన్ నుంచి నెలకు 40 లక్షలు భరణం డిమాండ్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేసింది.
కానీ కోర్టు ఆర్తికి 40 లక్షల భరణం ఎందుకు, నెలకు మూడు లక్షల భరణం సరిపోతుంది అంటూ తీర్పు నివ్వడంతో సోషల్ మీడియాలో ఆర్తిపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఆర్తికి ఆశ ఎక్కువ, లేదంటే 40 లక్షల భరణం కావాలా, కోర్టు ఆర్తికి భలేగా మొట్టికాయలు వేసింది, ఆర్తి మదం కోర్టు దించేసింది అంటూ ఆమెపై ట్రోల్స్ మొదలయ్యాయి.
దానితో ఆర్తి తల్లి సుజాత రవి మోహన్ పై ఫైర్ అవుతూ ప్రెస్ మీట్ పెట్టింది.. ఆర్తి ఊరికే నెలకు 40 లక్షల భరణం అడగలేదు, రవి మోహన్ సినిమాల కోసం రూ.100 కోట్ల దాక అప్పు చేసింది. దానికి వడ్డీలు కట్టడానికే రవిమోహన్ నుంచి 40 లక్షలు భరణం అడిగింది. అంతే కాకుండా గత రెండేళ్లుగా పిల్లల బాగోగులు రవి మోహన్ పట్టించుకోవడం లేదు. వారి తిండి, చదువు, ఇతర ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని సుజాత అన్నారు.
రవి మోహన్ ఇప్పుడిచ్చే మూడు లక్షలు పిల్లలకు తినడానికే సరిపోతాయని, పిల్ల ఫీజులు ఎవరు చెల్లిస్తారు, పిల్లల ఫీజులు స్కూల్ లో 86 లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. కోర్టు ఆ అపెండిగ్ ఫజులు కట్టమని రవిమోహన్ కి చెప్పింది, తన పిల్లలను పెంచమంటే పెంచుతాను కానీ రవి పిల్లలను పెంచాల్సిన అవసరం లేదు అంటూ రవి మోహన్ మాజీ అత్తగారు సుజాత ప్రెస్ మీట్ పెట్టి మరీ రవి మోహన్ పై ఫైర్ అయ్యింది.







































