వారణాసి-క్రేజీ సీక్రెట్స్ రివీల్ చేసిన జక్కన్న

Varanasi Movie Shooting UpdateVaranasi Movie Shooting Update


ఏప్రిల్ 7, 2027 వారణాసి రిలీజ్ పక్కా.. ఇదే రాజమౌళి పదే పదే చెబుతున్న మాట. వారణాసి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మార్చుకోదు. అందుకు అనుగుణంగానే వారణాసి షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ తో పాటుగా ఎడిటింగ్, గ్రాఫిక్ వర్క్ అన్ని జరిగిపోతున్నాయి. తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో గూస్ బంప్స్ తెప్పించే సీక్రెట్స్ రివీల్ చేసారు.

వారణాసి షూటింగ్ 80 శాతం పూర్తయ్యింది, ఇంకో 20 శాతమే బ్యాలెన్స్ ఉంది, వారణాసిలో మేజర్ సీన్స్, యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ పూర్తయ్యింది. ఇంకా చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. షూటింగ్ పూర్తయ్యింది పూర్తయినట్టుగా ఎడిటింగ్ రూమ్ కి పంపించి గ్రాఫిక్ వర్క్ చేపిస్తున్నామంటూ రాజమౌళి వారణాసి పై బిగ్ సీక్రెట్స్ రివీల్ చేసారు.

అంతేకాకుండా వారణాసి లో హీరో తన ప్రయాణాన్ని వారణాసి నుంచి మొదలు పెట్టి అంటార్కిటికాకు వెళ్తాడు. ఆ తర్వాత ఆఫ్రికాకు, ప్రాచీన రోమ్ కు కూడా వెళ్తాడంట. హీరో చివరకు తిరిగి వారణాసికి రావడంతో సినిమా ముగుస్తుందని రాజమౌళి వారాణసి పై చాలా విషయాలను ఆ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు.

Varanasi Shooting Update: Rajamouli Reveals Major Details