సూపర్ హిట్ మూవీ ఇప్పుడు ఓటీటీ లోకి
Hrudayam Murali OTT Release Date Fix
తమిళనాట అధర్వ మురళి, కాయదు లోహర్, ప్రీతి ముకుందన్ కలయికలో తెరకెక్కిన హృదయం మురళి చిత్రం కోలీవుడ్ థియేటర్స్ లో మంచి హిట్ గా నిలిచింది. కానీ తెలుగులో ఈ చిత్రాన్ని పేక్షకులు లైట్ తీసుకున్నారు. సెకండ్ హాఫ్ వీక్ గా ఉంది అంటూ తెలుగు ఆడియన్స్ తేల్చేసారు. అయినా ఈ చిత్రానికి తెలుగులోనూ ప్రమోషన్స్ చేసి ఉంటే ఎంతో కొంత వర్కౌట్ అయ్యేది.
ఇక తమిళనాట హిట్ చిత్రంగా నిలిచిన హృదయం మురళి ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో చేజిక్కించుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ రెడీ అయ్యింది.
ఆగస్టు 7 నుంచి హృదయం మురళి చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. కాకపోతే అది తమిళంలోనేనా, లేదంటే మిగతా భాషల్లో కూడా హృదయం మురళి స్ట్రీమింగ్ లోకి వస్తుందా అనేది మాత్రం క్లారిటీ లేదు.







































