ఎన్టీఆర్ పిక్ కోసం వెయిటింగ్
NTR fans
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముంబై వెళ్లి కోకిలాబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి సర్జరీ చేయించుకుని వచ్చారు. ఆయన్ను పరామర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటోస్ బయటికొచ్చాయి. ఇక నందమూరి బాలకృష్ణ NBK 111 షూటింగ్ లో గాయపడి హైదరాబాద్ AIG లో మోకాలి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఆయన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. అలా బాలయ్య హాస్పిటల్ పిక్ బయటికి వచ్చింది.
ఇక రామ్ చరణ్ మణికట్టు సర్జరీకి కోయంబత్తూరు వెళ్లినప్పటినుంచి ఆయన ఆపరేషన్ చేయించుకున్న విషయమే కాదు, డాక్టర్స్ కి థాంక్స్ చెబుతున్న పిక్స్, అలాగే ఆయన డిశ్చార్జ్ అయిన ఫొటోస్ వైరల్ అయ్యాయి. మరి ఇలా ప్రమాదాల బారిన పడిన హీరోల హాస్పిటల్ ఫోటోలు బయటికొచ్చాయి.
అయితే డ్రాగన్ సెట్ లో భుజానికి దెబ్బతగిలించుకుని ఆసుపత్రికి వెళ్లి ఎనిమిది వారాల పాటు రెస్ట్ తీసుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటో బయటకు రాలేదు. డాక్టర్స్ ఆయనకు ట్రీట్మెంట్ చేసినట్టుగా అఫీషియల్ నోట్ వదిలినా అందుకు సంబందించిన ఎన్టీఆర్ పిక్ బయటకి రాపోయేసరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.







































