అలియాస్ రుక్మిణి ఇంట్రెస్టింగ్
Alias Rukmini glimpse attracts
వరస ప్లాప్స్ తో సతమతమవుతున్న యంగ్ హీరో నితిన్ కి మరో హీరో నాని హిట్ ఇచ్చేపనిలో ఉన్నారు. హీరో నాని నిర్మాణంలో నితిన్ హీరోగా మూవీ తెరకెక్కబోతుంది. దానికి సంబందించిన టైటిల్ గ్లింప్స్ ని రివీల్ చేసారు. నితిన్-నాని కలయికలో తెరకెక్కబోతున్న చిత్రానికి అలియాస్ రుక్మిణి టైటిల్ ని ఫైనల్ చేసారు.
అలియాస్ రుక్మిణి టైటిల్ గ్లింప్స్ లో నితిన్ లుక్ ని కూడా రివీల్ చేసారు ఆ వీడియో లో నితిన్ బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ నా భార్య, మై వైఫ్ అంటూ చెప్పిన డైలాగ్, చివరిలో నాని ఐ లవ్ దిస్ స్క్రిప్ట్.. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అంటూ నాని వాయిస్ అన్ని అలియాస్ రుక్మిణి టైటిల్ గ్లింప్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయంటూ ఆడియన్స్ అప్పుడే కామెంట్స్ పెడుతున్నారు.
మరి ప్లాప్ ల్లో ఉన్న హీరో కి నాని హిట్ ఇస్తాడా.. నాని జెడ్జిమెంట్ అంటే ప్రేక్షకుల్లో బోలెడంత నమ్మకం. సో హీరోగా నాని కాకపోయినా హీరో నాని సినిమానే ఈ అలియాస్ రుక్మిణి.







































