ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rajamouli Explains Why Varanasi Is Being Shot in IMAX

వారణాసి విజువల్స్ పై రాజమౌళి హైప్

Rajamouli Explains Why Varanasi Is Being Shot in IMAX

 

పాన్ ఇండియా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిస్తున్న వారణాసి షూటింగ్ ఎంత స్పీడుగా సాగుతుందో అంతే స్పీడుగా వారణాసి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు. ఎప్పుడు సినిమా విషయాలేవీ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలకే తీసుకునే రాజమౌళి ఈసారి తన స్టార్స్ తో కలిసి వారణాసి విషయాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు.

ప్రస్తుతం వారణాసి కి సంబందించిన యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ ముగిశాయని సమాచారం. తాజాగా రాజమౌళి వారాణసి చిత్రం కోసం అసలు ఐమాక్స్ సాంకేతికతనే ఎందుకు ఎంచుకున్నారో అనేది రివీల్ చేస్తూ వారణాసి విజువల్స్ పై హిప్ క్రియేట్ చేసారు. వారణాసి చిత్రంలో విజువల్స్ అత్యంత బ్రహ్మాండమైన పరిమాణంలో ఉంటాయి.

అంటార్కిటికా ప్రాంతంలో ఉండే దాదాపు 300 అడుగుల అంటే సుమారు 91 మీటర్లు ఎత్తున్న భారీ మంచు కొండల దృశ్యాలు వారణాసిలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక  కథలో భాగమైన విలక్షణమైన రామాయణ వానర సేనల భారీ యుద్ధ సన్నివేశాలు ఐమాక్స్ స్క్రీన్పై మాత్రమే సరిగ్గా అనుభూతి చెందగలరని రాజమౌళి వారణాసి విజువల్స్ పై హైప్ క్రియేట్ చేసారు.

Rajamouli revealed that editing and graphics work